టీఆర్ఎస్‌కు ఇండిపెండెంట్ సంపూర్ణ మద్దతు...

టీఆర్ఎస్‌కు ఇండిపెండెంట్ సంపూర్ణ మద్దతు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన కోరుగంటి చందర్... తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసిన చందర్... టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ కి తెలియజేశారు. ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేశానన్న ఆయన... టీఆర్ఎస్ పార్టీ తన మాతృసంస్థే నన్న చందర్... ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని ప్రకటించారు.