టి.టి.డి పవిత్రతను కాపాడాలి..

టి.టి.డి పవిత్రతను కాపాడాలి..

ఈ రోజు చెన్నై లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో TTD ప్రధాన అర్చకులు శ్రీ రమణదీక్షితులు గారు మాట్లాడుతూ తిరుమల విషయంలో ప్రభుత్వం, TTD బోర్డు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు.వారు తెలిపిన కొన్ని ముఖ్య విషయాలు 

(1) ధర్మానికి ,శాస్త్రాలకు విరుద్ధంగా TTD బోర్డు & అధికారులు వ్యవహరిస్తున్నారు.

(2) స్వామి వారి నిత్య పూజలకు ,సేవలకు కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డు తగులుతున్నారు.

(3) స్వామి వారికి సమయానికి కాసింత నైవేద్యం కూడా పెట్టనీయడం లేకుండా VIP ల సేవలో అధికారులు తరిస్తున్నారు.

(4) సాంప్రదాయక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ తమ సొంత జాగీరుగా మార్చుకోవాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

(5) దేవాలయ నిర్వహణపై కనీస అవగాహన లేని బోర్డు & అధికారుల కారణంగా భక్తుల విశ్వాసాలు గాయపడుతున్నాయి.

(6)సామాన్య భక్తులపై అమర్యాదగా ప్రవర్తిస్తూ స్వామి వారి దర్శనాన్ని కూడా సరిగ్గా చేసుకోనీయడం లేదు.

(7) తిరుమలకట్టడాలను, స్వామి వారి ఆభరణాలను, పురాణాలను,  శాస్త్రాలను, వ్యవస్థలను సంరక్షించుకోవడానికి భక్తులు ఉద్యమించాలి.

(8) తిరుమల దేవస్థానంలో CC కెమరాలు పనిచేయకుండా చేసి అనేక శాస్త్ర విరుద్ధమైన కార్యక్రమాలకు ,అక్రమాలకు పాల్పడుతున్నారు.(9)TTD లో పెద్దఎత్తున అవినీతి రాజ్యమేలుతుంది ,తిరుమలలో వెలుగుచూస్తున్న వ్యవహారాలపై CBI దర్యాప్తు జరిపించాలి.

(10) తిరుమల పవిత్రతను కాపాడాలని నిలదీస్తే మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.మాపై కక్ష కట్టి ప్రధాన అర్చక వ్యవస్థను మరియు సన్నిధి గొల్ల వ్యవస్థను తీసేయడానికి కుట్రలు చేస్తున్నారు.

తిరుమల తిరుపతి లో జరుగుతున్న కుట్రలు ఆందోళన కలిగిస్తున్నాయని అందుకే దశాబ్దాల మౌనాన్ని వీడి భక్తులతో కలిసి తిరుమల పవిత్రత కాపాడటానికి ఉద్యమించాలని స్వామి వారి ఆదేశంమేరకే ఈనాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు.తిరుమల తిరుపతి పవిత్రత కాపాడటానికై భక్త కోటి ముందుకు కదలాల్సిన సమయం ఆసన్నమైంది.