టీటీడీ పై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు..!

 టీటీడీ పై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు..!

తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన పూజారి రమణ దీక్షితులు టీటీడీ పై  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆలయ పూజారుల రక్షణ విషయంలో టీటీడీ విఫలమైందని ఆరోపించారు. ఇటీవల కన్నుమూసిన అర్చకులకు ఆర్థిక సహాయం మంజూరు చేయాలని  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థించారు. సీనియర్ ప్రదాన అర్చకులు పదవీ విరమణ తరవాత వంశపారంపర్య సేవలను పునరుద్ధరించాలని పోరాడుతూ మరణించారని తెలిపారు. మరో 45 సంవత్సరాల జూనియర్ అర్చకులు స్వామివారికి సేవలందిస్తూ మరణించారని అన్నారు. వారిని కాపాడటంలో టీటీడీ విఫలమయ్యిందని పేర్కొన్నారు. తన ట్వీట్ ను ముఖ్యమంత్రి జగన్ కు మరియు టీటీడీ ఛైర్మెన్ వైవి సుబ్బారెడ్డి కి ట్యాగ్ చేసారు.