అర్చక వ్యవస్థలో వేలు పెట్టలేరు

అర్చక వ్యవస్థలో వేలు పెట్టలేరు

టీటీడీ పాలకమండలి వ్యవహారశైలిపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చుకులు రమణ దీక్షితులు చేసిన సంచలన ఆరోపణలు పెను దుమారమే రేపాయి. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా 65 ఏళ్లు పైబడిన వారు పదవి విరమణ చేయాలని తీర్మానించడంతో పాటు రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేస్తామని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఇది జరిగిక కొద్దిసేపటికే రమణ దీక్షితులు మళ్లీ సీన్‌లోకి వచ్చారు.

అర్చకుల రిటైర్‌మెంట్ నిర్ణయం నా ఆరోపణలకు వ్యతిరేకంగానే తీసుకున్నారు.. అయితే తిరుమల శ్రీవారి ఆలయ అర్చక వ్యవస్థలో వేలు పెట్టే అధికారం టీటీడీకి లేదని ఆయన అన్నారు. హిందూ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రభుత్వానికి ఇతర మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దమ్ము వుందా..? అని ప్రశ్నించారు. శ్రీవారికి నైవేద్యం కూడా పెట్టనివ్వడం లేదని.. ఆగమశాస్త్ర విరుద్ధంగా పూజలు జరుగుతున్న విషయాన్ని భక్తులకు తెలియజేప్పేందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. పాలకమండలి నిర్ణయాన్ని చట్టపరంగా ఏదుర్కొంటానని రమణ దీక్షితులు ప్రకటించారు.