కలకలం సృష్టిస్తున్న రమణదీక్షితుల వ్యాఖ్యలు

కలకలం సృష్టిస్తున్న రమణదీక్షితుల వ్యాఖ్యలు

తిరుమల ప్రధాన అర్చకుడిగా తనను తొలగించే అధికారం టీటీడీకి ఎవరిచ్చారని రమణదీక్షితులు ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యమా లేక నిరంకుశత్వమా అని ప్రశ్నించారు. తనపై పరువు నష్టం దావా వేశారని, ఆ నోటీసు తనకు అందిందని అన్నారు. ఆభరణాలు లెక్కలు చెప్పాకే దావా వేయాలన్నారు. తన ఆరోపణలు తప్పని నిరూపించాల్సిన బాధ్యత టీటీడీపైనే ఉందని రమణదీక్షితులు చెప్పారు. తనపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేశారని, అంటే.. ఆరోపణల విలువ వంద కోట్లే అని తేల్చేశారని అన్నారు. శ్రీవారా ఆభరణాలు భద్రంగా ఉన్నాయని నిరూపించగలరా అని ప్రశ్నించారు.  తిరుమలలో మలిన ప్రసాదాలు పెడుతున్నారని ఆరోపించారు. కోట్లాదిమంది పవిత్రంగా భావించి పూజించే స్వామి వారినే అపవిత్రంగా ఉంచుతున్నారని అన్నారు.