తిత్లీ బాధితులకు రామానాయుడు ట్రస్ట్ సాయం !

తిత్లీ బాధితులకు రామానాయుడు ట్రస్ట్ సాయం !

 కొన్నిరోజుల క్రితం సంభవించిన తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పలు గ్రామాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.  ప్రభుత్వంతో పాటు సినీ పరిశ్రమ కూడ  బాధితులకు అండగా నిలబడింది.  అనేక మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ వంతు సహాయాన్ని చేశారు. 

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సైతం తమ రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందించింది.  ట్రస్టుకు చెందిన కొందరు ఈరోజు నందిగాము, సోంపేట మండలాల్లోని బాధితులకు కావలసిన నిత్యావసర సరుకులను అందజేశారు.  ఈ సందర్బంగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సహాయం చేసిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపింది.