'అందుకే ఈవీఎంలపై బాబు దుష్ప్రచారం'

'అందుకే ఈవీఎంలపై బాబు దుష్ప్రచారం'

ఓటమి భయంతోనే ఈవీఎంలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు. ఇవాళ రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదన్నారు.ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తోందన్న ఆయన.. ఈవీఎంలలో అవకతవకలనే ప్రచారం అబద్ధం అని అన్నారు. రాబోయే పంచాయితీ ఎన్నికల నుంచే రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కసరత్తు చేస్తామని రామ్‌మాధవ్‌ చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు.