'ఢిల్లీని ఢికొట్టింది ఆయనొక్కరే..'

'ఢిల్లీని ఢికొట్టింది ఆయనొక్కరే..'

ధర్మపోరాట దీక్షకు సిక్కోలు గడ్డ ఎప్పుడూ సిద్ధమేనని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో జరుగుతున్న ధర్మ పోరాట దీక్షలో ఇవాళ ఆయన మాట్లాడుతూ ఏపీకి న్యాయపరంగా దక్కాల్సినవి పొందేందుకు నాలుగున్నరేళ్లుగా పోరాడుతున్నామన్నారు. కేంద్రంలోని పెద్దలు కుట్ర రాజకీయాలతో నమ్మకద్రోహం చేశారన్న ఆయన.. ఏపీ కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్ ఎంతమంది మోడీసేనలో చేరినా..చంద్రన్న సేనను ఏం చేయలేరని స్పష్టం చేశారు. విభజన హామీలకు పరిష్కారం దొరకాలంటే మోదీని గద్దె దింపాల్సిందేనని ఎంపీ స్పష్టం చేశారు. త్వరలో మోడీని గద్దె దించబోతున్నామంటూ హిందీలో పంచ్‌ ఇచ్చారు. 25 ఎంపీ స్థానాలు గెలిచి.. ఏపీకి రావాల్సినవి సాధించుకుందామన్నారు.