'జగన్‌.. మీకు మా జిల్లానే దొరికిందా..?'

'జగన్‌.. మీకు మా జిల్లానే దొరికిందా..?'

తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు పక్క జిల్లాలో ఉండి రాలేని ప్రతిపక్ష నేత జగన్...ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జిల్లాలో తిరుగుతున్నారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ధర్మపోరాట దీక్షలో ఇవాళ ఆయన మాట్లాడుతూ రాజకీయాలు చేయడానికి జగన్‌కు తమ జిల్లానే దొరికిందా అని నిలదీశారు. కోడి కత్తి గాయానికే అల్లాడిపోతున్న జగన్‌కు.. సిక్కోలు వాసులకు తగిలిన తిత్లీ గాయం కనిపించలేదా అని ఎంపీ ప్రశ్నించారు.