రాంనగర్‌ కొర్పొరేటర్‌ బూతుపురాణం.. ఆడియో వైరల్‌

రాంనగర్‌ కొర్పొరేటర్‌ బూతుపురాణం.. ఆడియో వైరల్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు ముగిసాయి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి.. ఇక, ప్రమాణస్వీకారోత్సవం లేట్‌ అయినా.. త్వరలోనే ఆ తంతు కూడా పూర్తికానుంది.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, కార్పొరేటర్‌గా గెలిచి.. ఇంకా ప్రమాణస్వీకారం చేయకుండానే కొందరు రెచ్చిపోతున్నారు. కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నారు.. నోటికి వచ్చిన బూతులు తిడుతూ బెదిరింపులకు దిగాడు.. తాజాగా రాంనగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించిన రవిచారి. అయితే, రవిచారి బూతుపురాణం, నీ అంతు చూస్తానంటూ ఓ కార్యకర్తపై బెదిరింపులకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ప్రమాణస్వీకారం చేయకముందే.. పరిస్థితి ఇలా ఉందంటే.. ఆ తర్వాత ఏంటి పరిస్థితి అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. పార్టీ నేతలు రవిచారిని మందలించినట్టు తెలుస్తోంది.