కేసీఆర్‌కు గుణపాఠం చెప్తాం

కేసీఆర్‌కు గుణపాఠం చెప్తాం

అంబేడ్కర్‌ను అవమానపరుస్తున్న కేసీఆర్‌కు గుణపాఠం చెబుతామని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు.  దేశంలో అందరూ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటుంటే కేసీఆర్ మాత్రం పాల్గొనడంలేదని, పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే కేసీఆర్ కనీసం స్పందించలేదని అన్నారు.  అంతేగాక 'అంబేడ్కర్ రాజ్యాంగం రాసి ఉండకపోతే గిరిజనులు ఎమ్మెల్యేలు అయ్యేవారా.   మీరు గిరిజన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు అయితే వెంటనే స్పందించాలి లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వం.  తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.  అంబేడ్కర్ 120 అడుగుల విగ్రహం ఏమైంది కేసీఆర్.  ఉద్యోగులు ఆఫీసుల్లో నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలపాలి.  22వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడతాము' అని అన్నారు.