జగన్ తల్లిగా రమ్య కృష్ణ ?

జగన్ తల్లిగా రమ్య కృష్ణ ?
ఈ మధ్య మన తెలుగులో బయోపిక్ ల పరంపర బాగా సాగుతోంది. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగానే షూటింగ్ మొదలెట్టింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ జగన్ అమ్మ విజయమ్మ పాత్రలో రమ్య కృష్ణని తీసుకునే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే సినిమాకి మరింత బలం చేకూరినట్లవుతుంది. వైఎస్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. ఇతని లుక్ అచ్చం రాజశేఖర్ రెడ్డి లాగే అనిపించడంతో ఎటువంటి నెగెటివిటీ లేకుండా ఫుల్ పాజిటివ్ వైబ్స్ రావడం విశేషం. జగన్ పాత్రలో సూర్య నటిస్తున్నాడని గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ను 70mm ఎంటర్ టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.