హీరోలా కనిపించే విశాల్ పెద్ద విలన్..విశాల్ మాజీ ఉద్యోగి రమ్య!

 హీరోలా కనిపించే విశాల్ పెద్ద విలన్..విశాల్ మాజీ ఉద్యోగి రమ్య!

తమిళ హీరో విశాల్ గత వారం తన ప్రొడక్షన్ హౌస్ లో ఆరేళ్లుగా పనిచేసిన రమ్య అనే మహిళ దాదాపు రూ. 45 లక్షలు కాజేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన దగ్గర పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు రమ్య, హరి లు లక్షల్లో డబ్బులను కాజేశారని విశాల్ అభియోగం వ్యక్తం చేసారు. తాజాగా విశాల్ చేసిన ఆరోపణలపై రమ్య స్పందించింది. పైకి హీరోలా కనిపించే విశాల్, వాస్తవానికి పెద్ద విలన్ అంటూ వ్యాఖ్యానించింది. రమ్య మీడియాతో మాట్లాడుతూ...తనదగ్గర విశాల్ కు సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయని తెలిపింది. తన దగ్గర ఉన్న అధరాలు భయటపెడితే విశాల్ నిజస్వరూపం భయటపడుతుందని తెలిపింది. తాను ఎవరినీ మోసం చేయలేదని, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నానని...కానీ తనపైనే అభియోగాలు వచ్చాయి కాబట్టి, టైం వచ్చినప్పుడు అన్ని భయట పెడతానని హెచ్చరించింది. ఇక రమ్య చేసిన కామెంట్స్ పై విశాల్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.