షాకింగ్.. అలాంటి పాత్రలో రమ్యకృష్ణ !

షాకింగ్.. అలాంటి పాత్రలో రమ్యకృష్ణ !

ఒకప్పుడు స్టార్ నటీమణిగా వెలిగిన రమ్యకృష్ణ 'బాహుబలి' చిత్రంతో మరోసారి తన నటన నైపుణ్యాన్ని నిరూపించుకుని లైమ్ లైట్లోకి వచ్చారు.  ఆ సినిమా తరవాత ఆమెకు ఆఫర్లు పెరగడం ఎక్కువైంది.  ఆమె కూడా ఛాలెంజింగ్ పాత్రలనే ఎంచుకోవాలనే ఉద్దేశ్యంతో తాజాగా 'సూపర్  డీలక్స్' అనే తమిళ చిత్రాన్ని ఓకే చేశారట. ఇందులో ఆమె చేయబోయేది ఒక శృంగార తార పాత్రని తెలుస్తోంది.  సమంత, విజయ్ సేతుపతిలు ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ సినిమాను త్యాగరాజన్ కుమారరాజా డైరెక్ట్ చేస్తున్నాడు.  ఈ వేసవికి సినిమావిడుదలకానుంది.