చంద్రబాబుగా రానా సిద్ధం !

చంద్రబాబుగా రానా సిద్ధం !

ఈ నెల 22న బాలకృష్ణ నటించిన 'మహానాయకుడు' రిలీజ్ కానుంది.  ఎన్టీఆర్ యొక్క రాజకీయ జీవితంపై ఈ సినిమా ఉడనుంది.  ఇందులో నారా చంద్రబాబు నాయుడుగారి పాత్రను నటుడు రానా పోషించాడు.  ఆ పాత్ర కోసం రానా బాగానే కష్టపడ్డాడు.  ముఖ్యంగా చంద్రబాబు ఆహార్యంలో కనిపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.  చంద్రబాబును గుర్తుచేసేలా నటించాడు.  దానికి సంబందించిన వీడియోను చిత్ర యూనిట్ ఉదయం రిలీజ్ చేసింది.  క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బాలక్రిష్ణ స్వయంగా నిర్మించారు.