హీరోయిన్ గా మిహిక.. క్లారిటీ ఇచ్చిన రానా

హీరోయిన్ గా మిహిక.. క్లారిటీ ఇచ్చిన రానా

భల్లాలదేవుడు రానా ఈ ఏడాది ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే..  ఈవెంట్ వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ ఉమెన్ మిహిక బజాజ్ ను రానా ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే సౌత్ హీరోయిన్స్ లా  మిహిక చాలా అందంగా ఉంటుందని,  ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే తప్పకుండా సక్సెస్ అవుతారని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ విషయం పై రానా స్పందించాడు. మిహికకు సినిమాలపై ఆసక్తి లేదు. ఆమె పూర్తిగా తన ఈవెంట్లు మరియు ఇతర వ్యాపారాలపైనే ఫోకస్ తో ఉంది.అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రానా తన సినిమాలతో .. అయన సతీమణి తన బిజినెస్ లతో బిజీగా ఉన్నారు.