తారక్‌కు రానా భలే గిఫ్ట్ ఇచ్చాడే !

తారక్‌కు రానా భలే గిఫ్ట్ ఇచ్చాడే !

తారక్‌కు ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులే ఉన్నారు.  వారిలో రానా దగ్గుబాటి కూడా ఒకరు.  తాజాగా రానా తారక్‌కు అమరచిత్రకథ అనే పుస్తకాల సిరీస్ బహుమతిగా ఇచ్చాడు.  ఈ  అమరచిత్రకథలో పురాణాలు, వీరగాథలు, చరిత్రలోని గొప్పవ్యక్తుల జీవితాలు, గొప్ప సంఘటనలు, జానపద కథలు కామిక్స్ రూపంలో ఉంటాయి.  పిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఈ పుస్తకాలకి చాలామందే ఫాలోవర్లు ఉన్నారు. 

దర్శక ధీరుడి రాజమౌళి 'బాహుబలి' సినిమా తీయడానికి స్ఫూర్తి ఆ పుస్తకాల ద్వారానే పొందానని ఒక సందర్భంలో అన్నారు.  అలాంటి పుస్తకాల్ని తారక్‌కు ఇచ్చాడు రానా.  వాటిని అందుకున్న తారక్ చిన్నతి రోజులు గుర్తొస్తున్నాయని, వాటి వాలాను తన బాల్యాన్ని తన కుమారుడు అభయ్ తో కలిసి పంచుకునే ఛాన్స్ దొరికిందని సంబరపడిపోతున్నాడు.