రానాకి సుక్కూ ఈసారైనా హిట్టిస్తాడా!?

రానాకి సుక్కూ ఈసారైనా హిట్టిస్తాడా!?

ఇదేంటి రానాకి సుక్కు హిట్ ఇవ్వటమేంటని అనుకుంటున్నారా!... నిజమే అటు సుకుమార్, ఇటు రానా ఇద్దరూ వేరే వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అయితే సుకుమార్ రైటింగ్స్ పేరుతో సొంతంగా బ్యానర్ ప్రారంభించిన సుకుమార్ ఈ సంస్థ నుంచి తన శిష్యులను దర్శకుల్ని చేస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. అలా సుకుమార్ రైటింగ్స్ తో నాగచైతన్య- రాజ్ తరుణ్ - వైష్ణవ్ తేజ్ వంటి హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చింది సుక్కూ శిష్యులే. ఇప్పుడు ఈ లిస్ట్ లో దగ్గుబాటి రానా కూడా చేరబోతున్నాడు.

సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో నటించేందుకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సుక్కూ అసిస్టెంట్ వెంకీ దర్శకత్వంలో రానా హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఇక్కడో తిరకాసు ఉంది. సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో నటించటం రానాకు ఇదే తొలి సారి కాదు. ఇంతకు ముందు సుకుమార్ శిష్యుడు ప్రకాశ్ తోలేటి తో 'నా ఇష్టం' అనే సినిమాలో నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరోసారి సుకుమార్ శిష్యుడితో సినిమా చేయబోతున్నాడు రానా. మరి ఈసారైనా రానాకు సుక్కూ కాంపౌండ్ హిట్టిస్తుందా? లేదా? అనే ఆసక్తికర చర్చ ఫిలిమ్ నగర్ లో జరుగుతోంది. అయితే సుకుమార్ రైటింగ్స్ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉండటం రానాకు కలసి వచ్చే అంశం. త్వరలోనే సుక్కూ-రానా-వెంకీ కలయికకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు వినికిడి.