తన ఆరోగ్యంపై చేదు వార్త చెప్పిన హీరో రానా..!
భల్లాలదేవుడు రానా ఈ ఏడాది ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే.. ఈవెంట్ వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ ఉమెన్ మిహిక బజాజ్ ను రానా ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే.. ఈ భల్లాలదేవుడు తాజాగా అభిమానులకు ఓ చేదు వార్త చెప్పాడు. సమంత హోస్ట్‌గా వ్యవహరించే "సామ్‌జామ్" కార్యక్రమంలో పాల్గొన్న రానా తన ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. " జీవితం వేగంగా ముందుకెళ్తున్న సమయంలో ఒక చిన్న పాజ్ బటన్ వచ్చింది... పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉంది. గుండెకు సమస్య తలెత్తుతుంది. నా కిడ్నీలు పాడవుతాయని డాక్టర్లు చెప్పారు. మెదడులో నరాలు చిట్లిపోవడానికి 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉంటుందని డాక్టర్లు అన్నారు" అని చెబుతూ రానా కన్నీరు పెట్టుకున్నాడు. రానా చెప్పిన మాటలకు హోస్ట్ హీరోయిన్ సమంత కూడా కంటతడి పెట్టుకుంది. కాగా.. ప్రస్తుతం రానా నటిస్తోన్న "విరాట పర్వం" సినిమా షూటింగ్ దశలో ఉండగానే.. అరణ్య మూవీ విడుదలకు సిద్ధం అయింది. 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)