వెంకీ కోసం రానా ఏం చేశాడంటే..

వెంకీ కోసం రానా ఏం చేశాడంటే..

భిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న నటుడు రానా.  ప్రజెంట్ ఈయన 'హాతి మేరే సాతి' చిత్రంలో నటిస్తున్నాడు.  అలాగే విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి  చేస్తున్న 'వెంకీ మామ'లో కూడా అతిథి పాత్రలో నటిస్తున్నాడట.  అది కూడా కాసేపే.  రానా ఈ సినిమాలో నటించడానికి ప్రధాన కారణం వెంకీ, చైతూ ఇద్దరూ తనకి దగ్గర బంధువులు కావడం.  వారికోసమే ఒప్పుకున్నాడట రానా.  బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్ ఫుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.