అఫీషియల్: పవన్ ను ఢీకొట్టనున్న భల్లలాదేవ

అఫీషియల్: పవన్ ను ఢీకొట్టనున్న భల్లలాదేవ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ‘వకీల్ సాబ్’ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక దీని తర్వాత వరుస సినిమాలకు పవన్ కళ్యాణ్ ఓకే చేశారు. అయితే వాటిలో ఏ సినిమాని మొదట సెట్స్ పైకి తీసుకెళ్తాడు అనే దానిపై క్లారిటీ లేదు.

తాజాగా పవన్ ‘వకిల్ సాబ్’ తరువాత చేయబోయే సినిమాకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పనుమ్ కోషియమ్`‌ను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ తెలుగులోకి రీమేక్ చేస్తోంది. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకుడు వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్‌తోపాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.