గృహం డైరెక్టర్‌తో రానా ఎప్పుడంటే..

గృహం డైరెక్టర్‌తో రానా ఎప్పుడంటే..

రానా దగ్గుపాటి తన తదుపరి చిత్రాన్ని గృహం సినిమా దర్శకుడితో చేయనున్నాడు. మణిరత్నం వద్ద దర్శకత్వం నేర్చుకున్న మిలింద్ రౌ తన సినీ జీవితాన్ని కాదల్ 2 కళ్యాణం అనే సినిమాతో మొదలు పెట్టాడు. ఆ తరువాత సిదార్థ హీరోగా గృహం సినిమా తీసి తెలుగు, తమిళ భాషల్లో భారీ హిట్ అందుకున్నాడు. గృహం హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రగా నెట్రికన్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. మరి కొన్నాళ్లలోనే రానుందని సమాచారం. అయితే ఇప్పుడు మిలింద్ టాలీవుడ్ హీరో రానాతో మూడు భాషల్లో సినిమాను తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు రానా కూడా పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో పాటుగా ఈ సినిమాను విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్‌పై ఆచంట గోపీనాథ్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా పట్టాలెక్కుతుందట. ప్రస్తుతం రానా విరాట పర్వం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత కొత్త సినిమాను మొదలు చేస్తాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే రానా నటించిన త్రిభాషా చిత్రం ‘అరణ్య’ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహిత ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న విరాట పర్వం సినిమా తరువాత గుణశేఖర్ డైరెక్షన్‌లో ‘హిరణ్యకశప’ అనే భారీ ప్రాజెక్ట్‌ను రానా చేయనున్నాడు. అయితే రానా చేస్తున్న ప్రతి సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. మరి వాటిని రానా అందుకుంటాడేమో చూడాలి.