నాని సినిమాకు రానా ప్రొడ్యూసర్..!!

నాని సినిమాకు రానా ప్రొడ్యూసర్..!!

నాని హీరోగా తెలుగులో వచ్చిన జెర్సీ సినిమా సూపర్ హిట్టైంది.  క్రికెట్ బాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబుతున్న సంగతి తెలిసిందే.  షాహిద్ కపూర్ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.  దిల్ రాజు, అల్లు అరవింద్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  

జెర్సీ సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేయబోతున్నారు.  దీనిని తమిళ్ లో రానా ప్రొడ్యూస్ చేస్తున్నారు.  విష్ణు విశాల్ ఈ సినిమాలో నాని రోల్ చేస్తున్నారు.  త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తాయి.  ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రానా అనేక చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహారిస్తుండటం విశేషం.