ఈ ఘనత ప్రభాస్, రానా, రాజమౌళికే దక్కుతుంది !

ఈ ఘనత ప్రభాస్, రానా, రాజమౌళికే దక్కుతుంది !

'బాహుబలి' సినిమాతో దర్శకుడు రాజమౌళి, అందులో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, రానాలు దేశవ్యాప్త క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.  అందుకే ఈ ముగ్గురిని తన పాపులర్ షో కాఫీ విత్  కరణ్ కు ఆహ్వానించాడు ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్.  సౌత్ సినీ పరిశ్రమ నుండి మొదటగా ఈ షోకు హాజరవుతోంది ఈ ముగ్గురే కావడం విశేషం. 

 

'బాహుబలి'కి తాను సహా నిర్మాత కావడం వలనే కరణ్ జోహార్ వీరి ముగ్గుర్ని ఈ షోకు ఆహ్వానించారు.  త్వరలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ షో ద్వారా కరణ్ వీరి ముగ్గురి నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులకు తెలియని కరణ్ ప్రేక్షకులకి ఇప్పటి వరకు తెలియని ఎలాంటి విషయాల్ని బయటకు లాగుతారో చూడాలి.