రానాకు జపాన్ నుండి బోలెడు గిఫ్ట్స్ !

రానాకు జపాన్ నుండి బోలెడు గిఫ్ట్స్ !

 

'బాహుబలి' సినిమాతో నటుడు రానా దాదాపు ప్రపంచం మొత్తం తెలిసిపోయాడు.  ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.  ముఖ్యంగా సినిమాను జపాన్ ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు.  సినిమాలోని భల్లాలదేవ పాత్రలో రానా కనబరిచిన నటనకు ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు అక్కడ.  ఆ అభిమానులంతా ఈరోజు రానా పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ జపాన్ నుండి 19 బాక్సుల నిండా బోలెడు ఉత్తరాలు, బహుమతులు ఆయన కోసం పంపారు.  అవన్నీ ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఆఫీసుకు చేరుకున్నాయి.