రానా స్పీడుకు బ్రేకుల్లేవ్ !

రానా స్పీడుకు బ్రేకుల్లేవ్ !

నటుడు రానా విరామం లేకుండా కథలు వింటూ, కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నారు.  ఇప్పటికే 'హాతి మేరే సాతి' సినిమా షూటింగ్లో ఉన్న ఆయన ఆ తరవాత గుణశేఖర్ యొక్క 'హిరణ్యకశ్యప' సినిమా చేయనున్నాడు.  దాని తరవాత వేణు ఊడుగులతో ఒక సినిమా ఒప్పుకుని ఉన్నాడు.  ఈ రెండూ కాకుండా ఇప్పుడు దర్శకుడు మిలింద్ రావు డైరెక్షన్లో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  గుణశేఖర్, వేణు ఊడుగుల సినిమాలు పూర్తికాగానే ఈ చిత్రం మొదలవుతుంది.  మిలింద్ రావు గతంలో సిద్దార్థ్ హీరోగా 'గృహం' అనే హర్రర్ మూవీ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఇకపోతే రానా నటించిన 'మహానాయకుడు' చిత్రం త్వరలోనే విడుదలకానుంది.