మరో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రానా...!!

మరో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రానా...!!

రానా వెండితెరకు లీడర్ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. సినిమా చాలా సాఫ్ట్ గా ఉంటుంది.  రానా నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది.  సినిమా విజయానికి కారణమైంది.  ఆ తరువాత నేనే రాజు నేనే మంత్రి సినిమా చేశాడు.  డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. పదవి, అధికారం ఉన్నవాడికే సమాజంలో గౌరవం ఉంటుంది అనే కాన్సెప్ట్ తో సాగే సినిమా ఇది.  తేజ అద్భుతంగా తెరకెక్కించాడు.  

ఇప్పుడు మరోసారి రానా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా చేయబోతున్నాడు.  నీది నాది ఒకటే కథ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఉడుగుల పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఓ కథను సిద్ధం చేసుకున్నాడు.  పంచాయితీ రాజ్ వార్డ్ మెంబర్ కు సంబంధించిన సినిమా ఇది.  సాయి పల్లవి హీరోయిన్.  రానా చేస్తున్న హాతి మేరీ సాథీ, ఇతర సినిమాలు పూర్తికాగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుందట.