సాయి పల్లవితో రానా సినిమా !

సాయి పల్లవితో రానా సినిమా !

'నీది నాది ఒకే కథ' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తన తర్వాతి సినిమాలో కథానాయకిగా సాయి పల్లవిని చాలా రోజుల క్రితమే అనుకున్నారు.  కానీ హీరోను మాత్రం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు.  అతను మరెవరో కాదు రానా దగ్గుబాటి. 

వేణు ఊడుగుల చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో రానా ఈ సినిమాను ఓకే చేశారట.  ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ముగిసిన ఈ సినిమా 2019లో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది.  త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.