#RRR లో రానా..?

#RRR లో రానా..?

ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది.  బాహుబలి సినిమాలో హీరోగా చేసిన ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో.. విలన్ పాత్ర చేసిన రానాకు కూడా అంతే పేరు వచ్చింది.  చెప్పాలి అంటే ప్రభాస్ కంటే రానాకు ఇంకా ఎక్కువ పేరు వచ్చింది.  రానాతో సినిమా చేయడం చాలా కంఫర్టుగా ఉంటుందని రాజమౌళి చాలాసార్లు చెప్పారు.  విలక్షణమైన నటుడు కావడంతో.. రానాతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతారు.  

ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.  సెకండ్ షెడ్యూల్ జనవరిలో ప్రారంభం కాబోతున్నది.  ఈ సినిమా కథను ఇంతవరకు లాక్ చేయలేదు.  దీనికి కారణం లేకపోలేదు.  బాహుబలి లాగే దీనిని రెండు పార్టులుగా తీస్తే బాగుంటుందని.. నిర్మాతలకు కూడా సేఫ్ అవుతుందనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడని వార్తలు వచ్చాయి.  

ఆర్ఆర్ఆర్ విలన్ రోల్ చాలా కొత్తగా, పవర్ఫుల్ గా డిజైన్ చేస్తున్నారు.  హీరోతో సమానంగా విలన్ రోల్ ఉండబోతున్నది.  విలన్ రోల్ కోసం ఇప్పటికే రాజమౌళి చాలా మందిని సంప్రదించారు.  కన్నడ రాక్ స్టార్ యాష్ ను విలన్ గా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ విషయాన్ని ఇంతవరకు రాజమౌళి టీమ్ కన్ఫర్మ్ చేయలేదు.  

ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త చక్కర్లు కొడుతున్నది.  ఆర్ఆర్ఆర్ లో విలన్ రోల్ ను భళ్లాలదేవుడు రానా చేస్తున్నారని సమాచారం.  రానాతో పాటు యాష్ కూడా ఇందులో మరో విలన్ రోల్ ప్లే చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఇందులో ఏది నిజం అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.