సూర్య కోసం రానా

సూర్య కోసం రానా

తమిళ  హీరో సూర్యకు తెలుగునాట చాలామంది స్నేహితులున్నారు.  తరచూ ఇక్కడి హీరోల వేడుకలకు ఆయన హాజరవుతుంటారు.  అందుకే వారంతా ఆయన కొత్త చిత్రం 'కాప్పన్' తెలుగు వెర్షన్ కోసం తమవంతు సహకారం అందిస్తున్నారు.  నటుడు రానా సూర్యతో తనకున్న స్నేహం కారణంగా ఆ చిత్రం యొక్క  ట్రైల‌ర్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదలచేయనున్నారు.  కొన్నిరోజుల క్రితమే రాజమౌళి ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.  కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 30న విడుదలచేయనున్నారు.