అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రానా

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన రానా

దగ్గుపాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో దర్శకుడు ప్రభుసోల్మన్ తో ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామా `అరణ్య ` తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఏకంగా 5 భాషల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం గా ఉంది. అరణ్య షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది.అయితే సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాల్సి ఉంది. థియేటర్లు మూతబడటంతో సినిమా ఇన్నాళ్లు ప్రేక్షకుల ముందుకు రాలేదు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే విక్టరీ వెంకటేష్ తో కలిసి సినిమా చేయాలని రానా ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. నాగచైతన్య తో వెంకటేష్ వెంకీ మామ అనే సినిమా చేసాడు.  మంచి కథ దొరికితే వెంకటేష్  రానా కలిసి సినిమా చేయాలని చూస్తున్నారు తాజా ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ .. బాబాయితో సినిమా చేయడం కోసం చాలా రోజులుగా మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ లాక్ డౌన్ టైంలో ఆ మంచి కథ దొరికింది అంటూ పేర్కొన్నాడు. రానా  వెంకటేష్ కలిసి నటిస్తున్నారంటే ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.