అరణ్య ట్రైలర్ రిలీజ్ అప్పుడే

అరణ్య ట్రైలర్ రిలీజ్ అప్పుడే

రానా దగ్గుపాటి ఈ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరు. బాహుబలి సినిమాతో జాతియ స్థాయి గుర్తింపు పొందిన రానా ఎప్పుడూ కూడా ప్రయోగం చేయడానికి ముందుంటారు. అలా రానా చేసిన తాజా ప్రయోగం అరణ్య. బాహుబలి తరువాత రానా చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం రానా భారీగా బరువు తగ్గారు. అరణ్య సినిమా కోసం రానా ఇంత కష్టపడినా సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాలేక పోయింది. ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఇటీవల రిలీజ్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను మార్చి26న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం అభిమానులంతా ఈ సినిమా ట్రైలర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మూడు భాషల్లో తెరకెక్కతుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కావడం లేదు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి3న, హిందీలో మార్చి4న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఏనుగుల సంరక్షణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జోయా హుస్సేస్, విష్ణు విశాల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రభు దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.