ఆ సినిమాకు రానా వాయిస్ ప్లస్ అవుతుందా..?

ఆ సినిమాకు రానా వాయిస్ ప్లస్ అవుతుందా..?

రానా దగ్గుబాటి మల్టీటాలెంట్ హీరో.  హీరోగా, విలన్ గా నటిస్తూ కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాడు.  ఇటీవలే వచ్చిన ఎవెంజర్స్ తెలుగు వెర్షన్ కు రానా వాయిస్ ఓవర్ ఇచ్చాడు.  రానా బేస్ వాయిస్ కావడంతో.. కొన్ని కీలకమైన సీన్స్ కోసం రానా వాయిస్ ను అడుగుతున్నారట.  సుమంత్ నటిస్తున్న సుబ్రహ్మణ్యపురం సినిమా కోసం రానా వాయిస్ అందిస్తున్నట్టు తెలుస్తున్నది.  

సినిమా రానా వాయిస్ తో ఓపెన్ అవుతుందట.  అలాగే క్లోజింగ్ కూడా రానా వాయిస్ తోనే ఎండ్ అవుతుందని అంటున్నారు.  సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రానా వాయిస్ ప్లస్ అవుతుందని సుమంత్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.