రానా బడ్జెట్ 100 కోట్లా.. 200 కోట్లా

రానా బడ్జెట్ 100 కోట్లా.. 200 కోట్లా

రానా సైన్ చేసిన సినిమాల్లో 'హిరణ్యకశ్యప' కూడా ఒకటి.  ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేయనున్నారు.  చాలా నెలల నుండి ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.  ఈ సినిమాను తెరకెక్కించడానికి భారీ బడ్జెట్ అవసరంవుతుందని గుణశేఖర్ అంటున్నారు.  ఆ మొత్తం ఎంతంటే 200 కోట్ల వరకు అవుతుందని చెబుతున్నారు.  సినిమాలో హైస్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ వాడాల్సి ఉండటంతో ఇంత మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తోందని గుణశేఖర్ అంటున్నారు.  కానీ సినిమాకు అయ్యే అసలు మొత్తం 100 కోట్ల వరకే ఉంటుందని, కావాలనే హైప్ కోసం 200 కోట్ల చెబుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.