అక్షయ్ స్థానంలో రన్బీర్..?

అక్షయ్ స్థానంలో రన్బీర్..?

టి సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా మొఘల్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో మొదట అక్షయ్ కుమార్ ను తీసుకున్నారు.  టైటిల్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది.  ఏమైందో ఏమో తెలియదుగాని, స్క్రిప్ట్ నచ్చలేదని అక్షయ్ కుమార్ సడెన్ గా ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నాడు.  అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు భూషణ్ కుమార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.  

అక్షయ్ కుమార్ తప్పుకోవడంతో ఆ స్థానంలో సంజు బయోపిక్ హీరో రన్బీర్ కపూర్ ను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది.  సంజు హిట్ తరువాత మరో బయోపిక్ లో నటించేందుకు రన్బీర్ కపూర్ ఉత్సాహంగా ఉన్నట్టు సమాచారం.  గుల్షన్ కుమార్ పాత్రలో నటించేందుకు రన్బీర్ కపూర్ ఒప్పుకున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.