విచిత్ర ఒప్పందం: మూడు రోజులు భార్యతో... మూడు రోజులు ప్రియురాలితో 

విచిత్ర ఒప్పందం: మూడు రోజులు భార్యతో... మూడు రోజులు ప్రియురాలితో 

అప్పటికే ఆ వ్యక్తికి పెళ్లయింది.  భార్యతో హ్యాపీగా సంసారం చేస్తున్నాడు. సంసారం చేస్తూనే మరొక ప్రియురాలితో పరిచయం పెంచుకున్నాడు.  ఆ పరిచయం ప్రేమగా మారింది.  కొన్నిరోజుల తరువాత ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. దీంతో కట్టుకున్న భార్య షాక్ అయ్యింది.  వెంటనే, పోలీసులకు ఫిర్యాదు చేసింది.  భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలించి భర్తను, ప్రియురాలిని పట్టుకున్నారు. అయితే, ప్రియురాలితో పెళ్లి జరిగిందని చెప్పడంతో, భార్య దిగి వచ్చింది.  పోలీసుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు.  మూడు రోజులు భార్య దగ్గర, మరో మూడు రోజులు ప్రియురాలి దగ్గర ఉండాలని పోలీసులు ఒప్పందం చేశారు.  ఒకరు రెస్ట్ తీసుకునేలా ఒప్పందంలో పేర్కొన్నారు.  అంతా ఒకే అనుకున్నాక, ప్రియురాలు ట్విస్ట్ ఇచ్చింది.  తమకు వివాహం జరగలేదని, పెళ్లి పేరుతో మోసం చేశాడని, లైంగికంగా ఇబ్బందులు పెట్టాడని చెప్పి పోలీస్ కేసు పెట్టింది.  ప్రియురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసేందుకు భర్త ఇంటికి రాగా అప్పటికే ఆ భర్త ఇంటి నుంచి పారిపోయాడట.  భర్త ఇంటి నుంచి పారిపోయేందుకు భార్య సహకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది.  దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.  ఈ సంఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది.