సమ్మర్ కు మారిన ఆ ఇద్దరి సంక్రాంతి పోరు!

సమ్మర్ కు మారిన ఆ ఇద్దరి సంక్రాంతి పోరు!

కరోనా కారణంగా థియేటర్లు బంద్ కావడంతో సినిమాల విడుదల తేదీలన్నీ తారుమారు అయిపోయాయి. దాంతో చాలా సినిమాలు సంక్రాంతి బరిలో దిగి తమ సత్తాను చాటాలనుకున్నాయి. కానీ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు తొలికాపీ సిద్ధం చేసుకున్న సినిమాలు సంక్రాంతి సీజన్ లో కర్చీఫ్ వేసేశాయి. దాంతో మరి కొన్ని సినిమాలు అనివార్య కారణంగా తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఆ రకంగా ఈ యేడాది సంక్రాంతి బరిలో ఖచ్చితంగా దిగుతాయని అనుకున్న నితిన్ 'రంగ్ దే', రానా 'అరణ్య' సినిమాలూ వాయిదా పడ్డాయి. ఇక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది. నితిన్ సినిమా 'రంగ్ దే'ను మార్చి 26న సమ్మర్ స్పెషల్ గా విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు. సరిగ్గా అదే తేదీన రానా నటించిన బహుభాషా చిత్రం 'అరణ్య' కూడా థియేటర్లలో సందడి చేయబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా విడుదలైంది. సో... సమ్మర్ బరిలో పోటీని తప్పించుకున్న ఈ ఇద్దరు యంగ్ హీరోలు, తమ చిత్రాలతో సమ్మర్ సీజన్ తో ఒకే రోజున జనం ముందుకు వచ్చి అదృష్టం పరీక్షించుకోబోతున్నారు!