రంగ‌స్థ‌లం అస‌లు లెక్క‌లివి...

రంగ‌స్థ‌లం అస‌లు లెక్క‌లివి...
రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` రికార్డులు మోతెక్కిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా 80 కోట్ల షేర్ వ‌సూళ్ల‌తో మ‌హేష్ `శ్రీ‌మంతుడు` ఫుల్‌ర‌న్ వ‌సూళ్ల‌ను అధిగ‌మించింది. త‌దుప‌రి `ఖైదీనంబ‌ర్ 150` షేర్ 150 కోట్ల రికార్డును అందుకోనుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. టాలీవుడ్ టాప్‌-3 సినిమాగా `రంగ‌స్థ‌లం` రికార్డుల‌కెక్కింది. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ షేర్ వివ‌రాలు ప‌రిశీలిస్తే తేలిన వాస్త‌విక లెక్క‌లివి... నైజాం- 16.86 కోట్లు, సీడెడ్ - 11.5 కోట్లు, ఉత్త‌రాంధ్ర -8.03కోట్లు, తూ.గో జిల్లా- 5.21 కోట్లు, ప‌.గో. జిల్లా- 4 కోట్లు, కృష్ణ‌- 4.67 కోట్లు, గుంటూరు - 6.07 కోట్లు, నెల్లూరు - 2.09 కోట్లు, ఏపీ+ నైజాం- 58.43 కోట్లు, ఇత‌ర చోట్ల నుంచి- 8.1 కోట్లు, ఓవ‌ర్సీస్ -13 కోట్లు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 80 కోట్లు వ‌సూలు చేసింది. రెండోవారంలో ఈ సినిమా 100 కోట్ల షేర్ వ‌సూలు చేస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి.