రామ్ చరణ్ సినిమాలు రెండు ఒకే రోజున.. ఫ్యాన్స్ కు పండుగే..

రామ్ చరణ్ సినిమాలు రెండు ఒకే రోజున.. ఫ్యాన్స్ కు పండుగే..

ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసింది కేవలం 12 సినిమాలే అయినప్పటికి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.  టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు.  మొదటి సినిమా చిరుత తరువాత రాజమౌళితో మగధీర చేసి ఇండస్ట్రీ రికార్డులు సృష్టించాడు.  ఆ తరువాత చరణ్ 11 వ సినిమాగా వచ్చిన రంగస్థలం మరో రికార్డును సొంతం చేసుకుంది.  ఈ రెండు చరణ్ కెరీర్ను మలుపు తిప్పాయి. 

ఈ రెండు సినిమాలు ఒకే రోజున టీవీలో ప్రసారం కాబోతున్నాయి.  స్టార్ మా టెలివిజన్ లో జూన్ రెండోవ తేదీన మధ్యాహ్నం రంగస్థలం సినిమా, సాయంత్రం మగధీర సినిమాలు ప్రసారం కాబోతున్నాయి.  స్టార్ ఎంటర్టైన్మెంట్ లో భాగంగా రెండు సినిమాలను ప్రసారం చేస్తున్నారు.  ఇది ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.