ఎన్నో ఏళ్ల అడ్డంకిని బ్రేక్ చేసిన 'రంగస్థలం' !

ఎన్నో ఏళ్ల అడ్డంకిని బ్రేక్ చేసిన 'రంగస్థలం' !

 

కన్నడ సినీ పరిశ్రమ చాలా ఏళ్ల నుండి ఇతర భాషల సినిమాలని తమ భాషలోకి డబ్ కానిచ్చేవి కావు.  ఏ సినిమా అయినా సరే దాని ఒరిజినల్ భాషలో రిలీజ్ కావాల్సిందే.  లోకల్ సినిమాలకి నష్టం వాటిల్లుతుందని భావంతో ఈ నిర్ణయం తీసుకున్నారు కన్నడ సినీ పరిశ్రమ వారు.  కానీ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది రామ్ చరణ్ 'రంగస్థలం'.  ఈ సినిమా తమిళ, మలయాళ భాషలతో పాటు కన్నడలోకి కూడా అనువాదం కానుంది.  కన్నడ చిత్రం 'కేజిఎఫ్'ను ఇతర భాషలు ప్రేక్షకులు విశేషంగా ఆదరించడంతో ఈ అనువాదం వీలవుతోంది.  సుకుమార్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.