రామ్ చరణ్ అక్కడ కూడా రఫ్ఫాడిస్తున్నాడుగా

రామ్ చరణ్ అక్కడ కూడా రఫ్ఫాడిస్తున్నాడుగా

రామ్ చరణ్ కేరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న 'రంగస్థలం' చిత్రం కన్నడలోకి 'రంగస్థల' పేరుతో  డబ్ అయిన సంగతి తెలిసిందే.  ఈ అనువాదం ఈరోజే విడుదలైంది.  అప్పట్లో 'మాయ బజార్' తరవాత మరే తెలుగు సినిమా కన్నడలోకి డబ్ కాలేదు.  ఇన్నేళ్లకు ఆ అవకాశం 'రంగస్థలం'కే దక్కింది.  

ఈ అవకాశాన్ని ఆ చిత్రం సద్వినియోగం చేసుకుంది.  అక్కడి ప్రేక్షకులకు చిత్రం బాగా నచ్చిందని సినీ వర్గాల టాక్.  గ్రామీణ నేపథ్యం కావడంతో అక్కడి మాస్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారట సినిమాకు.  చరణ్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయట.  ఈ సినిమాతో చరణ్ తరవాతి సినిమాల్ని కూడా యధావిథిగా కన్నడలోకి డబ్ చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం ఖాయం.