'రంగ‌స్థ‌లం' నుంచి మరో ట్రైల‌ర్‌

'రంగ‌స్థ‌లం' నుంచి మరో ట్రైల‌ర్‌
'మెగా పవర్‌ స్టార్‌' రామ్‌చరణ్‌ తేజ్‌, స్టైలిష్ దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందిన చిత్రం రంగస్థలం. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. మార్చ్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండే బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక రంగస్థలం సినిమా నాన్ బాహుబలి కేటగిరిలో రికార్డుల సునామి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చెవిటి పాత్రలో రామ్‌ చరణ్‌ అద్భుతంగా నటించడంతో.. ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రామ్ చరణ్ సరసన సమంత డిగ్లామర్ పాత్రలో సందడి చేసింది. ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, అన‌సూయ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. రంగస్థలం సినిమా పెద్ద హిట్ అయిన సందర్భంగా ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు 'రంగ‌స్థ‌లం' మేకర్స్ విజ‌యోత్సవ వేడుకను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి జనసేన అధినేత 'ప‌వర్ స్టార్' ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. పెద్ద విజయం సాధించినా కూడా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచడం కోసం చిత్ర యూనిట్ విజ‌యోత్సవ వేడుకలో ఓ ట్రైల‌ర్ ను విడుద‌ల చేసింది. మూడు నిమిషాల న‌ల‌భై సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా విడుద‌లైన కొత్త ట్రైల‌ర్‌ ను మీరు చూడండి. https://www.youtube.com/watch?time_continue=144&v=mhhb6JAJKbE