రంగస్థలం 5 రోజుల వసూళ్లు

రంగస్థలం 5 రోజుల వసూళ్లు
రామ్ చరణ్ తాజాగా నటించిన రంగస్థలం గతవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1980 కాలంనాటి గ్రామీణ రాజకీయ నేపథ్యంగా తెరకెక్కింది. సినిమాలో రామ్ చరణ్ సరికొత్త మేకోవర్..అద్భుతమైన నటన, మిగిలిన పాత్రలను సుక్కు మలిచిన తీరు ప్రేక్షకులను మూడు గంటలు ఎటు కదలకుండా కట్టిపడేశాయి. సమంత రామలక్ష్మి పాత్రలో కనబర్చిన అభినయం, ఆది పినిశెట్టి, జగపతి బాబుల పాత్రల తీరు, సినిమాలో కథ, కథనం సినిమాను విజయతీరాలకు నడిపించి కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి, ఓవర్సీస్ ల 3 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వైపు పయనిస్తోంది. మరి నిన్నటితో 5 రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏరియాల వారీగా ఏ మేరకు వసూళ్లను సాధించిందో చూసేద్దామా. నైజాం - 14.50 కోట్లు సీడెడ్ - 9.70 కోట్లు నెల్లూరు - 1.80 కోట్లు గుంటూరు - 5.52 కోట్లు కృష్ణ - 4.02 కోట్లు వెస్ట్ - 3.45 కోట్లు ఈస్ట్ - 4.56 కోట్లు UA- 6.79 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం చిత్రం ఐదు రోజులకు గాను 50.34 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. ఈ ఫీట్ తో రామ్ చరణ్ ఖాతాలో మరో యాబై కోట్ల సినిమా చేరడం విశేషం.