ఓవర్సీస్ లో రంగస్థలం సరికొత్త రికార్డ్

ఓవర్సీస్ లో రంగస్థలం సరికొత్త రికార్డ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్ మార్కెట్ లోను రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 3 మిలియన్ కలెక్షన్స్ ను సాధించి నాన్ బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకు ముందు బాహుబలి 1 సినిమా 6.8 మిలియన్ కలెక్షన్స్ ను సాధించగా, బాహుబలి 2 సినిమా 11.8 మిలియన్ కలెక్షన్స్ తో అగ్ర స్థానాల్లో కొనసాగుతున్నాయి. చరణ్ కెరియర్ లో రంగస్థలం సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా, త్వరలోనే వంద కోట్ల షేర్ వసూళ్లను సాధించే దిశగా పయనిస్తోంది. విడుదలైన రోజు నుండే ఓవర్సీస్ ప్రీమియర్ షోల ద్వారా మంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ ను నమోదుచేస్తోంది. ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే ఫుల్ రన్ లో 3.5 మిలియన్ మార్క్ ను అవలీలగా దాటేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడి పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించగా, రామలక్ష్మీ పాత్రలో సమంత అలరించింది.