రంగస్థలం సక్సెస్ మీట్ కు ఇద్దరు స్టార్ హీరోలు

రంగస్థలం సక్సెస్ మీట్ కు ఇద్దరు స్టార్ హీరోలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన రంగస్థలం గత నెల చివరి వారం విడుదలై భారీ విజయం సాధించింది. విడుదలైన అన్ని ఏరియాల్లోను మంచి పాజిటివ్ టాక్ తో విధ్వసంకర కలెక్షన్స్ తో బయ్యర్లను లాభాల పంట పండించింది. ఇక ఈ సంధర్భంగా చిత్రనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి మాసివ్ సక్సెస్ మీట్ ను జరపాలని నిర్ణయించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ ను ఈనెల 12న జరపాలని యోచిస్తున్నారట. ఈ సక్సెస్ మీట్ కు ముఖ్యఅతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు హాజరుకానున్నారట. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని చూసి..తాను పొందిన అనుభూతిని సక్సెస్ మీట్ లో చెప్తానని వెల్లడించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. మరి ఈ వేడుకను ఎక్కడ నిర్వహిస్తారో ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్..చెవిటివాడి పాత్రలో ఛాలెంజింగ్ గా నటించగా, సమంత..రామలక్ష్మీ పాత్రలో అలరించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ఎంటర్ టైనర్ ను నిర్మించారు.