ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ పై కంగన సోదరి కాంట్రవర్సీ ట్వీట్..

ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ పై కంగన సోదరి కాంట్రవర్సీ ట్వీట్..

ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుపుకునే ఫిలిం ఫేర్ వేడుక ఈ ఏడాది కూడా అదే లెవల్లో జరిగింది. అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో 65వ ఫిల్మ్‌ఫేర్ వేడుక జరుగగా..ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన తారలందరూ హాజరయ్యారు.ఇక ఈ ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవంలో బాలీవుడ్ మూవీ' గల్లీబాయ్'కి ఎక్కువ అవార్డులు దక్కాయి. అయితే ఈ అవార్డులపై హీరోయిన్ కంగన సోదరి రంగోలి స్పందించారు. బాలీవుడ్‌లోని మూవీ మాఫియా గురించి కంగన చాలా సందర్భాల్లో స్పందించిందని.. అందుకే తనకు, తాను నటించిన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదని రంగోలీ ఆరోపించారు.

' గల్లీబాయ్' సినిమాకు అన్ని అవార్డులు అవసరం లేదని.. ఉత్తమ నటిగా అలియాభట్ కు అవార్డు ఇచ్చారు  కానీ ఆమె నటన అంతగా ఎం లేదు అని రంగోలి విమర్శించారు. అదే విధంగా ఉత్తమ సహాయ నటిగా అనన్యపాండే కంటే 'పటాఖా' సినిమాలో నటించిన రాధిక మదన్‌కు ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని..ఆమె నటన చాలా బాగుందని రంగోలి అభిప్రాయపడ్డారు.రాధికకు అవార్డు ఇస్తే ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించినట్లు ఉండేదని ఆమె అన్నారు. ఇక 'మణికర్ణిక' సినిమాలో ఝలకరిభాయ్ గా నటించిన అంకితకు ఉత్తమసహాయ నటి అవార్డు ఇవ్వొచ్చు అని రంగోలి ట్వీట్ చేసారు ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.