వేరొక దేశంలో జెండా ఎగురవేసిన రాణీ ముఖర్జీ !

వేరొక దేశంలో జెండా ఎగురవేసిన రాణీ ముఖర్జీ !

స్వాతంత్ర్య దినోత్సవానికి ఇంకో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో యావత్ దేశం సంబరాలని సిద్ధమౌతోంది.  కానీ బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ మాత్రం రెండు రోజుకాలు ముందుగానే జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.  అయితే ఇది జరిగింది ఇండియాలో కాదు మెల్బోర్న్ లో.  

ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2018 కోసం మెల్బోర్న్ వెళ్లిన రాణీ ముఖర్జీ అక్కడి ఫెడరేషన్ స్క్వేర్ లో దాదాపు 10000 మంది భారతీయులు, ఆస్ట్రేలియన్ల సమక్షంలో జెండాను ఎగురవేశారు.  ఇలా దేశానికీ దూరంగా జెండాను ఎగురవేయడం దేశభక్తిని మరింత పెంచిందని, దీనినొక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆమె అన్నారు.