చైనాలో రాణి ముఖర్జీ సినిమా హల్చల్

చైనాలో రాణి ముఖర్జీ సినిమా హల్చల్

హాలీవుడ్ తరువాత అతిపెద్ద మార్కెట్ చైనా.  చైనాలో ఇండియన్ సినిమాలకు మంచి గిరాకి ఉంటున్న మాట వాస్తవమే.  దంగల్ సినిమా చైనాలో భారీ వసూళ్లు సాధించింది.  ఆ తరువాత సీక్రెట్ సూపర్ స్టార్, భజరంగి భాయ్ జాన్ వంటి సినిమాలు హవా కొనసాగింది.  తాజాగా రాణి ముఖర్జీ మెయిన్ రోల్ చేసిన హిచ్ కి సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తున్నది.  

ఇటీవలే చైనాలో రిలీజైన ఈ సినిమా రూ.150 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  ఇండియాలో ఈ సినిమా రూ.59 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.  దీనికి మూడింతలు చైనాలో వసూలు చేయడం విశేషం.  ఇండియన్ సినిమాలకు చైనాలో ఆదరణ లభిస్తుండటంతో.. ఇండియన్ సినిమా చైనా మార్కెట్ పై దృష్టి సారించింది.