'రణరంగం' ట్రీట్ రెడీ

 'రణరంగం' ట్రీట్ రెడీ

యువ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం 'రణరంగం'.  ఇందులో శర్వా గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు.  ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేశారు.  మొదటి నుండి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటంతో ప్రేక్షకులు టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.  రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ కూడా టీజర్ సిద్ధం చేసింది.  వచ్చే వారంలో ఈ టీజర్ ట్రీట్ ఉండనుంది.  ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ప్రధాన కథానాయకిగా నటించగా కళ్యాణి ప్రియదర్శన్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది.  ఆగష్టు 2వ తేదీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.