రాణు మోండాల్‌ పై నెటిజన్ల ఆగ్రహం

రాణు మోండాల్‌ పై నెటిజన్ల ఆగ్రహం

ఏక్‌ ప్యార్‌ కా నగ్‌ మా హై అంటూ పాడిన ఒకే ఒక్క పాటతో రాణు మోండాల్‌ సెలబ్రిటీగా మారారు. ఆ తర్వాత బాలీవుడ్‌ సాంగ్స్‌ పాడే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. అంత వేగంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె ప్రస్తుతం తన వ్యవహారశైలితో వారిని ఆగ్రహానికి గురి చేశారు. ఫోటో కోసం వచ్చిన అభిమానిపై ఆమె ప్రదర్శించిన కోపం ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. తాజాగా ఒక షాపింగ్ మాల్ లో ఫోటో దిగేందుకు ఓ మహిళా అభిమాని మోండాల్‌ దగ్గరకు వెళ్లింది. మోండాల్‌ ను చేతిలో తాకుతూ ఫోటో కావాలని అడిగింది. దీనికి అభిమాని వైపు తిరిగి ఏంటి చేతితో తాకుతున్నావ్‌, తనను తాకొద్దూ అంటూ కోపం వ్యక్తం చేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అయింది. దీంతో నెటిజన్లు ఆమె తీరును తప్పుబడుతున్నారు.